ప్రేమాలయం

siddharth new movie premalayam releasing shortly - Sakshi

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు సిద్ధార్థ్‌. కొంచెం గ్యాప్‌ తర్వాత ‘ప్రేమాలయం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వసంత బాలన్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ హీరోగా, వేదిక, అౖనైకా సోఠి హీరోయిన్లుగా తెరకెక్కిన ఓ తమిళ చిత్రం ‘ప్రేమాలయం’ పేరుతో తెలుగులో విడుదల అవుతోంది. పి. సునీత సమర్పణలో శ్రీధర్‌ యచ్చర్ల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

శ్రీధర్‌ యచ్చర్ల మాట్లాడుతూ– ‘‘సిద్ధార్థ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ విలన్‌గా నటించారు. ఏ.ఆర్‌. రెహమాన్‌గారి పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. వనమాలి, కందికొండ పాటలు, రాజశేఖర్‌ రెడ్డి మాటలు మా సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. చక్కటి కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రేమాలయం’ చిత్రాన్ని తెలుగుప్రేక్షకులకు అందించే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. త్వరలోనే పాటలను, మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.  ఈ చిత్రానికి కెమెరా: నీరవ్‌ షా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top