భయపెడతాం... నవ్వుకోండి!

Shraddha Kapoor, Rajkummar Rao Unite for Horror Comedy - Sakshi

నవ్వుతూ నీళ్లు తాగడం కష్టం. నవ్వుతూ భయపడటం కూడా అంతే. అయితే ‘మేం భయపెడతాం.. మీరు నవ్వుకోండి’ అంటున్నారు శ్రద్ధా కపూర్‌. రాజ్‌కుమార్‌ రావు హీరోగా ఓ హారర్‌ కామెడీ సినిమా రూపొందనుంది. అంటే.. భయంలోంచి నవ్వు పుట్టుకొస్తుందన్న మాట. ఇందులో కథానాయికగా నటించబోతున్నారు శ్రద్ధా.  నాలుగేళ్ల క్రితం వరుణ్‌ సందేశ్, సందీప్‌ కిషన్‌ కలిసి తెలుగులో నటించిన ‘డీ ఫర్‌ దోపిడి’ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించిన నిడిమోరు రాజ్, కృష్ణ డీకే ఈ సినిమాకు దర్శకులు.

కథ కూడా వాళ్లదే. స్మాల్‌ టౌన్‌ గాళ్‌గా నటించబోయే శ్రద్ధా కపూర్‌ క్యారెక్టర్‌ చుట్టూ ఈ సినిమా సాగుతుందని బీ టౌన్‌ టాక్‌. అయితే ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ‘సాహో’  సినిమాలో తన వంతు సీన్స్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాతే శ్రద్ధ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతారట. ‘‘ఇప్పటి వరకు నేను చేయని హారర్‌ జోనర్‌లో నటించబోతున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది. సూపర్‌ అమేజింగ్‌ యాక్ట్రస్‌ శ్రద్ధా కపూర్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు రాజ్‌కుమార్‌ రావు. ‘‘నా అభిమాన నటుల్లో ఒకరైన రాజ్‌కుమార్‌ రావుతో నటించబోతున్నాను. దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకేలతో సినిమా చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రద్ధా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top