బిగ్‌బీని అధిగమించిన కింగ్‌ఖాన్‌

Shah Rukh Break Amitabh Record And Hitting The Mark Of 39 Million on Twitter - Sakshi

జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ క్రేజ్‌ రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ సాధించి చాలా కాలమైనా అతడికి ఏ మాత్రం ఫ్యాన్‌ పోలోయింగ్‌ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా ట్విటర్‌లో 39 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి భారత సెలబ్రెటీగా షారుఖ్‌ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ 38.8 మిలియన్ల ఫాలోవర్స్‌తో ఆగ్రస్థానంలో ఉండేవాడు. తాజాగా అమితాబ్‌ను షారుఖ్‌ అధిగమించాడు. ఈ సందర్భంగా తనపై ప్రేమాభిమానాలను కురిపిస్తున్న అభిమానులకు షారుఖ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షారుఖ్‌ ఫాలవర్స్‌ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఇన్‌స్టాలో 18.6 మిలియన్ల మంది అభిమానులు షారుఖ్‌ను అనుసరిస్తున్నారు. 

ప్రస్తుతం బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ సౌదీ అరేబియాలో ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ  సౌదీ అరేబియా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ‘జాయ్‌ ఫోరయ్‌ 2019’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో హాలీవుడ్‌ స్టార్‌ జాసన్ మొమోవా, హాంకాంగ్‌ యాక్షన్‌ హీరో జాకీచాన్‌, బెల్జీయం నటుడుజీన్-క్లాడ్ వాన్ డామ్మేలతో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఎంతగా వైరల్‌ అయిందంటే కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క రోజులోనే ఆ ఫోటోకు దాదాపు 24 లక్షల లైక్‌లు వచ్చాయి.  

ఇక ‘రా వన్‌’, ‘జీరో’ సినిమాలు షారుఖ్‌ను పూర్తిగా నిరాశపరిచాయి. ముఖ్యంగా తన సొంత నిర్మాణ సంస్థలో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘జీరో’ బాక్సీఫీస్‌ వద్ద చతికిలపడింది. అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో నటుడిగానే కాకుండా నిర్మాతగా షారుఖ్‌ బిగ్‌ ఫేయిల్యూర్‌ను చవిచూశాడు. జీరో పరాజయంత తర్వాత మరో సినిమాకు షారుఖ్‌ ఇప్పటివరకు ఓకే చెప్పలేదు. అయితే వచ్చే ఈద్‌కు ఓ సినిమాను విడుదల చేయాలని షారుఖ్‌ బావిస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top