
తమకు నచ్చిన సెలబబ్రిటీ కళ్లముందు కనబడితే ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం దొరికిందే చాన్స్ అనుకొని సెలబబ్రిటీల దగ్గర మితిమీరి ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల సిసీనటులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్‌కు కూడా ఇలాంటి చేదు ఘటన ఎదురైంది. జిమ్ నుంచి బయటకు వచ్చిన సారా అక్కడి మీడియా ప్రతినిధులను నవ్వుతూ పలకరించింది. కొన్ని ఫొటోలకు స్టిల్స్ ఇవ్వండి అంటూ ఓ మీడియా కోరగా దాన్ని సున్నితంగా తిరస్కరించింది. అనంతరం అక్కడ ఉన్న అభిమానులతో సెల్ఫీలు దిగి, షేక్‌హ్యాండ్ ఇచ్చింది.
ఈ క్రమంలో ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇస్తున్న సారా చేతిని ముద్దాడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సారా తన చేయిని వెనక్కు తీసుకుంది. మితిమీరి ప్రవర్తించిన అభిమానిని అక్కడి సెక్యూరిటీ గార్డు కోపంతో కొట్టడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ ఘటనపై సారా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నువ్వు ఓ బాడీగార్డును నియమించుకోవచ్చు కదా’ అంటూ సారాకు సలహాలిస్తున్నారు. ‘అభిమాని హద్దు దాటి ప్రవర్తించడం ఏమీ బాగోలేదు’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. కాగా సారా అలీఖాన్ ‘కేదార్‌నాథ్’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కూలీ నం.1 రీమేక్, లవ్ ఆజ్ కల్ సీక్వెల్ చిత్రాల్లో నటిస్తున్నారు.
చదవండి:
వధూవరులుగా సారా-వరుణ్‌లు!