ఇక రెచ్చిపోతా!  | Actress Aathmika Ready To Bold Characters In Cinemas | Sakshi
Sakshi News home page

ఇక రెచ్చిపోతా! 

Jan 9 2020 9:08 AM | Updated on Jan 9 2020 9:41 AM

Actress Aathmika Ready To  Bold Characters In Cinemas - Sakshi

ఏ రంగంలోనైనా అవకాశాలు ఊరికే రావు.  ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే వారి చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం అందం. ఆ తరువాతనే ఏదైనా. అయితే అందం, అభినయం ఉన్నా అదృష్టం లేకుంటే అవన్నీ వృథానే. అలా అదృష్టాన్ని పరిక్షించుకునే పనిలో పడింది నటి ఆద్మిక. ఇప్పుడిప్పుడే కథానాయకిగా ఎదుగుతున్న ఈ అమ్మడు మీసై మురుక్కు చిత్రం ద్వారా నాయకిగా పరిచయమైంది. ఆ చిత్రం సక్సెస్‌ అయ్యింది. ఈ చిన్నది అవకాశాలను అందుకుంటోంది. అయితే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తొలి చిత్రంలో కళాశాల విద్యార్థినిగా నటించి పాటల సన్నివేశాల్లో కాస్త గ్లామర్‌ను ప్రదర్శించినా, అది పెద్దగా తనకు ఉపయోగపడలేదనుకుందేమో. ఇప్పుడు అందాలారబోతలో రెచ్చిపోతానంటోంది. 

అందుకు తగ్గట్టు ఓ ఫొటో సెషన్‌ చేసుకుని వాటిని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అవి కుర్రకారును గిలిగింతలు పెట్టిస్తున్నాయి. ఆ విధంగా తన ప్రయత్నం కొంతవరకు ఫలించిందని, ఇక మరిన్ని అవకాశాలను రాబట్టుకుంటే పూర్తిగా సఫలం అవుతుందని ఈ అమ్మడు భావిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిన్నది నటించిన కాటేరి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల కావలసి ఉంది. అదేవిధంగా నరకాసురన్‌ చిత్రంలో అరవిందస్వామికి జంటగా నటించింది.  చిత్రం విడుదలలోనూ జాప్యం నెలకొంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా కన్నై నంబాదే చిత్రంలో నటిస్తోంది. ఈ మూడు చిత్రాలు విడుదలయితే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తోంది. కాగా తన చిత్రాల విడుదల ఆలస్యం కావడంతో సినీ వర్గాలు తనను మరచిపోకుండా నూతన సంవత్సరంలో గ్లామరస్‌ ఫొటోలను విడుదల చేసి వారి దృష్టిలో పడే ప్రయత్నాలు చేసుకుంటోంది. సినీ వర్గాలేమో గానీ, కుర్రకారు మాత్రం ఆద్మిక అందాలను బాగానే ఆస్వాధిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement