‘పేపర్‌ బాయ్‌’ వచ్చేస్తున్నాడు..! | Sampath Nandi TeamWorks Paper Boy Teaser | Sakshi
Sakshi News home page

Jul 21 2018 10:41 AM | Updated on Jul 21 2018 11:34 AM

Sampath Nandi TeamWorks Paper Boy Teaser - Sakshi

సంతోష్ శోభన్ హీరోగా జయ శంకర్‌ను దర్శకుడి పరిచయం చేస్తూ పేపర్‌ బాయ్ సినిమాను తెరకెక్కించారు

సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమా టీజర్‌ విడుదలైంది.  రామ్‌చరణ్‌, రవితేజ, గోపిచంద్ లాంటి హీరోలతో మాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించిన సంపత్‌ తన స్వీయ నిర్మాణంలో సినిమాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆది హీరోగా గాలిపటం సినిమాను నిర్మించిన సంపత్‌ నంది తాజాగా తన బ్యానర్‌లో రెండో సినిమాను సిద్ధం చేశాడు.

తను నేను సినిమాతో పరిచయం అయిన సంతోష్ శోభన్ హీరోగా జయ శంకర్‌ను దర్శకుడి పరిచయం చేస్తూ పేపర్‌ బాయ్ సినిమాను తెరకెక్కించారు. సపంత్ నంది స్వయంగా కథా కథనాలు అందించిన ఈ సినిమాలో రియా సుమన్‌, తాన్యా హోపేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఆడియో, సినిమా రిలీజ్‌ డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement