
‘పేపర్‌బాయ్’ ఫేం జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అరి’. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 10న ఈ చిత్రం ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజైన సంగతి తెలిసిందే. రెండు వారాలుగా థియేటర్స్లో రన్ అవుతూనే ఉంది.
దీపావళి సందర్భంగా నాలుగు కొత్త చిత్రాలు (మిత్ర మండలి, డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్) బరిలోకి దిగాయి. అయినా కూడా అరి ఈ రెండో వారంలో కొనసాగుతోంది. పదో రోజు కూడా అరికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు జయ శంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పదో రోజు సినిమాని వీక్షిస్తున్నట్టు జయ శంకర్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

అరి కంటెంట్ బేస్డ్ మూవీ కావడంతో రెండో వారం కూడా కొనసాగించాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. అసలు ఈ మూవీ కోసం ఆర్టిస్టులంతా కలిసి ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తే నెక్ట్స్ లెవెల్లో ఉండేది. ఆడియెన్స్‌లోకి మరింత ఎక్కువగా వెళ్లే అవకాశం ఉండేది. మరి ఈ రెండో వారంలోనూ అరిని మేకర్లు ప్రమోట్ చేసి ఆడియెన్స్‌లోకి మరింతగా వెళ్తారా? లేదా? అన్నది చూడాలి.