‘సమ్మెహనం’ నటుడు మృతి | Sammohanam Fame Amit Purohit Dies | Sakshi
Sakshi News home page

‘సమ్మెహనం’ నటుడు మృతి

Jul 11 2019 12:20 PM | Updated on Jul 11 2019 12:20 PM

Sammohanam Fame Amit Purohit Dies - Sakshi

సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన సమ్మెహనం సినిమాలో అదితి రావ్‌ హైదరీ మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ పురోహిత్ మరణం ఇండస్ట్రీ వర్గాలకు షాక్‌ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమిత్‌ మృతి పట్ల సమ్మెహనం యూనిట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్ర అమిత్ మరణించినట్టుగా ట్వీట్ చేసిన సుధీర్ బాబు ఓ మంచి యువ నటుడ్ని కోల్పోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోయిన్ అదితి రావ్‌ హైదరీ, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణలు కూడా అమిత్‌ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. హిందీలో పంక్‌, ఆలాప్‌ లాంటి సినిమాల్లో నటించాడు అమిత్‌. అయితే అమిత్‌ మృతికి కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement