మరో సౌత్ రీమేక్పై కన్నేసిన సల్మాన్ | Salman Khan to remake Puri Jagannath Rogue | Sakshi
Sakshi News home page

మరో సౌత్ రీమేక్పై కన్నేసిన సల్మాన్

Feb 12 2017 11:16 AM | Updated on Mar 22 2019 1:53 PM

మరో సౌత్ రీమేక్పై కన్నేసిన సల్మాన్ - Sakshi

మరో సౌత్ రీమేక్పై కన్నేసిన సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాల మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నాడు. వరుస ఫ్లాప్ లతో

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాల మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నాడు. వరుస ఫ్లాప్ లతో తన కెరీర్ కష్టాల్లో ఉన్న సమయంలో సల్మాన్ కెరీర్ ను గాడిలో పెట్టింది సౌత్ రీమేక్ లే. వాంటెడ్, రెడీ, కిక్ లాంటి రీమేక్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసిన సల్మాన్, తరువాత కూడా తన సినిమాలో ఏదో ఒక రకంగా సౌత్ ఫ్లేవర్ కంటిన్యూ అయ్యేలా జాగ్రత్త పడుతున్నాడు.

ఇప్పుడు మరోసారి ఓ సౌత్ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు సల్మాన్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోగ్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సల్మాన్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రముఖ నిర్మాత తనయుడు ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్న రోగ్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఈ రీమేక్ లో సల్మాన్ నటించలేదు. కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తాడు. తాను పరిచయం చేసిన సూరజ్ పంచోలి హీరోగా రోగ్ ను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సల్మాన్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement