ఆర్‌ఆర్‌ఆర్‌: జక్కన్నతో బాలీవుడ్‌ స్టార్‌ హీరో | RRR Movie: Ajay Devgn Joins The Shooting | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ అప్‌డేట్‌: షూటింగ్‌ ప్రాంతానికి అజయ్‌ దేవ్‌గన్‌

Jan 21 2020 12:09 PM | Updated on Jan 21 2020 12:14 PM

RRR Movie: Ajay Devgn Joins The Shooting - Sakshi

మల్టీస్టారర్‌ సినిమాలకు ఉండే క్రేజే వేరు. పైగా ఇద్దరు లేదా అంతకుమించిన స్టార్‌ హీరోలు ఒకే ఫ్రేములో కనిపిస్తున్నారంటే వారి అభిమానులకు పండగే. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా గురించి ప్రేక్షకులు గతేడాది నుంచి పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల ఆలస్యం కానుందనే వార్త అందరినీ నిరాశకు గురి చేసింది. కానీ వీలైనంత త్వరగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని జక్కన్న ప్లాన్‌ చేస్తున్నాడు.

అందుకు తగ్గట్టుగానే సినిమాలోని కీలక సన్నివేశాల్ని శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న బాలీవుడ్‌ ప్రముఖ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ మంగళవారం షూటింగ్‌ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. ఈ మేరకు జక్కన్నతో కలిసి దిగిన ఫొటోను చిత్రబృందం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. నేటి నుంచి అజయ్‌పై చిత్రీకరణ జరపనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి:

ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదీ మారిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement