సంతానంతో రొమాన్స్‌కు రెజీనా రెడీ | Regina Romance with Santanan | Sakshi
Sakshi News home page

సంతానంతో రొమాన్స్‌కు రెజీనా రెడీ

Aug 10 2016 1:38 AM | Updated on Sep 4 2017 8:34 AM

సంతానంతో రొమాన్స్‌కు రెజీనా రెడీ

సంతానంతో రొమాన్స్‌కు రెజీనా రెడీ

హాస్యనటుడు సంతానంతో రొమాన్స్ చేసేందుకు నటి రెజీనా సిద్ధమవుతోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తదుపరి చిత్రంలో

హాస్యనటుడు సంతానంతో రొమాన్స్ చేసేందుకు నటి రెజీనా సిద్ధమవుతోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తదుపరి చిత్రంలో సంతానం హీరోగా నటించనున్నాడు. ఆయనకు జంటగా నటి రెజీనాను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ సమాచారం. దర్శకుడు సెల్వరాఘవన్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ బిజీ అవుతున్నారు. అలాగే దిల్లుకు దుడ్డు చిత్ర విజయంతో ఖుషీగా ఉన్న సంతానం ప్రస్తుతం సర్వర్ సుందరం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

 కాగా నటి రెజీనా తమిళ చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్‌గా మారారు. ప్రస్తుతం ఎళిల్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా రెజీనా నటిస్తోంది. అదే విధంగా నటుడు రానా దగ్గుబాటితో ద్విభాషా చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా  నెంజం మరప్పదిలై్ల అనే చిత్రాన్ని తీస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement