సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి

Regina Contest To Meet Her On Evaru Movie - Sakshi

నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్‌ కోసం ఎదురుచూసిన రెజీనాకు ‘ఎవరు’ రూపంలో మంచి విజయం లభించింది. అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలై.. మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన రెజీనా.. తనను కలుసుకునే అవకాశాన్ని ఇచ్చింది.

‘హలో.. ఎవరు చిత్రానికి వస్తున్న స్పందన, చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. మీరంతా కలవాలని అడిగితే కాదనగలనా? ఇక్కడ మీకోసం చిన్న కంటెస్ట్‌ నిర్వహించబోతోన్న.. ఎవరు చిత్రంలో సమీర భర్త పేరు చెప్పండి.. 18వ తేదీన నాతో కాఫీ తాగేందుకు జాయిన్‌ అవ్వండి’ అంటూ ట్వీట్‌ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం సమాధానం చెప్పండి..రెజీనాతో కాఫీ తాగే చాన్స్‌ కొట్టేయండి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top