బ్యూటిఫుల్‌

Rangeela tribute to be a bilingual movie - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘బ్యూటిఫుల్‌’. ఆయన గతంలో తీసిన ఐకానిక్‌ మూవీ ‘రంగీలా’ కు ఇది ట్రిబ్యూట్‌. నైనా, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇదివరకూ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని వర్మతో కలసి దర్శకత్వం వహించారు అగస్త్య మంజు. ప్రస్తుతం ‘బ్యూటిఫుల్‌’ చిత్రం రామ్‌గోపాల్‌ వర్మ టైగర్‌ ప్రొడక్షన్‌పై నిర్మాణం జరుపుకుంది. టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్‌కుమార్, టి. శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా  ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు. ‘‘మా ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.. అందరూ వెరీ బ్యూటిఫుల్‌ అంటున్నారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం:రవి శంకర్, సాహిత్యం: సిరా శ్రీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top