అవన్నీ వందతులే: రకుల్‌ ప్రీత్‌ | Rakul Preet singh chit chat with her career in film industry | Sakshi
Sakshi News home page

అవన్నీ వందతులే: రకుల్‌ ప్రీత్‌

May 30 2017 6:21 PM | Updated on Aug 28 2018 4:32 PM

అవన్నీ వందతులే: రకుల్‌ ప్రీత్‌ - Sakshi

అవన్నీ వందతులే: రకుల్‌ ప్రీత్‌

అభిమానులకు నచ్చేది హీరోయిన్ల అందాలేనంటోంది నటి రకుల్‌ప్రీతిసింగ్‌. కెరీర్‌ ప్రారంభంలో అవకాశాలు దక్కక కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు మకాం పెట్టిన ఈ బ్యూటీకి తెలుగు చిత్రపరిశ్రమ కలిసి వచ్చింది.

చెన్నై: అభిమానులకు నచ్చేది హీరోయిన్ల అందాలేనంటోంది నటి రకుల్‌ప్రీతిసింగ్‌. కెరీర్‌ ప్రారంభంలో అవకాశాలు దక్కక కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు మకాం పెట్టిన ఈ బ్యూటీకి తెలుగు చిత్రపరిశ్రమ కలిసి వచ్చింది. రకుల్‌ ప్రీతి నటించిన తాజా చిత్రం రారండోయ్‌ వేడుక చూద్దాం కూడా విజయబాటలో పయనించడంతో ఆమె మంచి జోష్‌లో ఉంది. అయితే అదే జోష్‌ను కోలీవుడ్‌లో పొందాలని తహతహలాడుతున్న ప్రస్తుతం కార్తీతో ‘ధీరన్‌ అధికారం ఒండ్రు’  చిత్రంలో నటిస్తోంది.

తాజాగా ఈ అమ్మడిచ్చిన భేటీలో ఏమందో చూద్దాం..

►సినిమా షూటింగ్‌ లొకేషన్స్‌ నాకు పాఠశాల లాంటిది. నిత్యం ఒక విద్యార్ధిలా వచ్చి నటించి వెళుతుంటాను. అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. జయాపజయాల గురించి ఆలోచించకుండా కఠినంగా శ్రమిస్తున్నాను. సినిమా నుంచి గ్లామర్‌ను వేరు చేయలేం. హీరోయిన్లు గ్లామరస్‌గా నటిస్తేనే అభిమానులు చూస్తారు. గ్లామర్‌ దుస్తుల్లోనూ హీరోయిన్లను దేవతలుగా చూడవచ్చు. ఇకపోతే ముద్దు సన్నివేశాలలో నటించడం తప్పు కాదు.

►కథకు అవసరం అయితే అలాంటి సన్నివేశాలలో నటిస్తాను. అయితే ఆ సన్నివేశాలు అశ్లీలంగా ఉండకూడదు. కొందరు ప్రచారాల కోసమే ముద్దు సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అలాంటి ముద్దు సన్నివేశాల్లో నటించడం నాకు నచ్చదు. సినిమా ఫీల్డ్‌ చాలా నచ్చింది. విరామం లేకుండా నటిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. కథలను నేనే ఎంపిక చేసుకుంటున్నాను. మంచి పాత్రలు అనిపిస్తేనే అంగీకరిస్తున్నాను. సినిమా నాకు చాలా ఇచ్చింది. ఇక్కడ నేనేమీ కోల్పోలేదు.

►కొన్ని చిత్రాలకు కాల్‌షీట్స్‌ ఇచ్చి అందులో నటించకుండా దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నాననే వదంతులు ప్రచారం చేస్తున్నారు. నిజానికి నేనెప్పుడూ అలా చేయను. అదే విధంగా చిత్ర జయాపజయాల గురించి బాధపడను. ఒక చిత్ర పరాజయానికి అందులో పని చేసిన వారందరూ బాధ్యత వహించాలి. ఈ సినిమా విజయం సాధిస్తుంది, ఈ చిత్రం అపజయం పాలవుతుందని ఎవరూ చెప్పలేరు. స్టార్‌ నటీనటులు నటించిన భారీ బడ్జెట్‌ చిత్రాలూ ప్లాప్‌ అవుతున్నాయి. చిన్న చిత్రాలు మంచి సక్సెస్‌ సాధిస్తున్నాయి.. ’అంటూ ముగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement