జక్కన్న మల్టీ స్టారర్ ఫ్యామిలీ డ్రామా..! | Rajamouli next movie family Drama | Sakshi
Sakshi News home page

Dec 10 2017 12:17 PM | Updated on Jul 14 2019 4:05 PM

Rajamouli next movie family Drama - Sakshi

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి ఇంత వరకు తన తదుపరి ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించలేదు. బాలీవుడ్ సినిమా చేస్తారంటూ.. ఈగ సినిమాకు సీక్వల్ రూపొందిస్తారంటూ రకరకాల వార్తలు వినిపించినా.. ఫైనల్ గా ఓ క్రేజీ మల్టీ స‍్టారర్ సినిమాకు రెడీ అవుతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో రాజమౌళీ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు.

అధికారిక ప్రకటన లేకపోయినా.. జక్కన్న నెక్ట్స్ సినిమా మల్టీస్టారరే అన్న విషయం దాదాపుగా కన్ఫమ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఏ జానర్ లో ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు బాక్సర్‌లుగా కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటి వరకు మాస్ యాక్షన్, ఫాంటసీ సినిమాలు మాత్రమే తెరకెక్కించిన రాజమౌళి ఈ సినిమాను ఫ్యామిలీ డ్రామాగా రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. జక్కన‍్న మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులను సాటిస్ఫై చేసే ఫ్యామిలీ కథను రెడీ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement