కవిత చాలెంజ్‌ స్వీకరించిన రాజమౌళి | Rajamouli Accepts MP Kavitha Green Challenge | Sakshi
Sakshi News home page

Jul 24 2018 3:31 PM | Updated on Jul 14 2019 4:05 PM

Rajamouli Accepts MP Kavitha Green Challenge - Sakshi

ఇటీవల ఫిట్‌నెస్‌చాలెంజ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. రాజకీయ నాయకులతో పాటు సినీతారలు కూడా ఈ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను స్వీకరించి తమ వర్క్‌ అవుట్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా మరో ఆసక్తికర చాలెంజ్‌కు సోషల్‌మీడియా వేదికైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత‍్మకంగా నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రమానికి  మద్దతుగా ప్రముఖులు గ్రీన్‌ చాలెంజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన దర్శక ధీరుడు రాజమౌళి సోషల్‌ మీడియాలో తాను మొక్కలు నాటుతున్న ఫొటోను షేర్‌ చేశారు. ‘చాలెంజ్‌ స్వీకరించాను కవిత గారు. మర్రి చెట్టు, గుల్మొహర్‌, వేప మొక్కలు నాటాను. ఇప్పుడు నేను పుల్లెల గోపిచంద్‌ గారు, కేటీఆర్‌గారు, యువ దర్శకులు సందీప్‌ వంగా, నాగ అశ్విన్‌ల ను హరిత హారం చాలెంజ్‌కు నామినేట్‌  చేస్తున్నాను’అంటూ ట్వీట్ చేశారు. రాజమౌళి ట్వీట్‌ పై స్పందించిన కవిత, రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement