లవ్లీ టీమ్‌తో... | Radhika Joins Sivakarthikeyan! | Sakshi
Sakshi News home page

లవ్లీ టీమ్‌తో...

Jul 26 2018 1:40 AM | Updated on Jul 26 2018 1:41 AM

Radhika Joins Sivakarthikeyan! - Sakshi

శివ కార్తికేయన్, రాధిక

సౌత్‌ లాంగ్వేజెస్‌లోనే కాదు హిందీ భాషలోనూ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు అలనాటి కథానాయిక రాధిక. 1980లలో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. రీసెంట్‌గా తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో తల్లి పాత్రలో కనిపించారామె.

ఇప్పుడు శివకార్తీకేయన్‌ హీరోగా రాజేశ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ తమిళ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు రాధిక. ‘లవ్లీ టీమ్‌తో జాయిన్‌ అయ్యాను’ అని ఆమె షూటింగ్‌ స్పాట్‌ ఫొటోను షేర్‌ చేశారు. నయతనార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో హాస్యనటులు యోగిబాబు, సతీష్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement