జనగణమన ఎవరు పాడతారు?

Puri Jagannadh's Jana Gana Mana: Mahesh Babu out, Yash in - Sakshi

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఈ సినిమా తర్వాత ‘జనగణమన’ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘జనగణమన’ చిత్రం మహేశ్‌బాబుతో హ్యాట్రిక్‌ కోసం తయారు చేసిన స్క్రిప్ట్‌ అని పూరి ఇదివరకు ప్రకటించారు. ‘పోకిరి, బిజినెస్‌మేన్‌’ వంటి హిట్స్‌ ఈ కాంబినేషన్‌లో వచ్చిన విషయం తెలిసిందే.

‘జనగణమన’ సినిమా గురించి మహేశ్‌ నుంచి ఎటువంటి కన్‌ఫర్మేషన్‌ రాలేదని పూరి తెలిపారు. తాజాగా ఈ సినిమాను కన్నడ హీరో యశ్‌తో ప్లాన్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ‘జనగణమన’ ఐడియాను యశ్‌కు పూరి చెప్పడం, తను కూడా ఆసక్తి చూపించడం జరిగిందట. కన్నడ– తెలుగు ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించాలనే ప్లాన్‌లో పూరి ఉన్నారనే వార్త వినిపిస్తోంది. ఇంతకీ... పూరి రాసిన ‘జనగణ మన’ను పాడేది ఎవరో వేచి చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top