వీరనారిగా | Priyanka Chopra to Team up with 'Mary Kom' Director to Play Lead in Film Based on World War II? | Sakshi
Sakshi News home page

వీరనారిగా

Dec 25 2014 11:08 PM | Updated on Sep 2 2017 6:44 PM

వీరనారిగా

వీరనారిగా

విభిన్న పాత్రలు పోషించాలని తపించే ప్రియాంకా చోప్రా... త్వరలో మరో కొత్త పాత్ర చేయనున్నారట. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కూడిన కథాంశంతో

విభిన్న పాత్రలు పోషించాలని తపించే ప్రియాంకా చోప్రా... త్వరలో మరో కొత్త పాత్ర చేయనున్నారట. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కూడిన కథాంశంతో రూపొందే ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రియాంక ప్రధాన భూమిక పోషించనున్నారని సమాచారం. వివరాల్లోకెళ్తే- ‘మేరీకోమ్’ దర్శకుడు ఒమాంగ్ కుమార్ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
 
 ఇది లేడీ ఓరియంటెడ్ కథాంశం కావడంతో, ‘మేరీకోమ్’లో అద్భుత నటన కనబరిచిన ప్రియాంకతోనే ఈ సినిమా కూడా చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడట. ప్రియాంకతో ఈ విషయం చెప్పగానే, ఆమె కూడా సానుకూలంగా స్పందించారని వినికిడి. ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన కథాంశం కావడం వల్ల ప్రీ ప్రొడక్షన్‌కే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే... వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌కి తీసుకెళ్లడానికి ఒమాంగ్ కుమార్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక పాత్ర అత్యంత శక్తిమంతంగా వీరనారి తరహాలో ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement