‘మిస్‌ వరల్డ్‌’ ఫొటో షేర్‌ చేసిన ప్రియాంక

Priyanka Chopra Shares 20 Years Old Picture As Miss World - Sakshi

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం.. గ్లోబల్‌ స్టార్ ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్నారు. అప్పటి వరకు బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఆమె పేరు.. ఒక్కసారిగా పతాక శీర్షికల్లో నిలిచింది. ఆ తర్వాత రెండేళ్లకు తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుపెట్టిన ప్రియాంక.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ నటిస్తూ గ్లోబల్‌ స్టార్‌ అనిపించుకుంటున్నారు. ఇక కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకునే పిగ్గీ చాప్స్‌.. యూనిసెఫ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.(ఆ డ్రెస్‌ నాకు బాగా నచ్చింది: ప్రియాంక తల్లి)

కాగా గత కాలపు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ప్రియాంక చోప్రా గురువారం షేర్‌ చేసిన ‘మిస్‌ వరల్డ్‌’ ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ‘‘2000 సంవత్సరం.. మిస్‌ వరల్డ్‌ ఎట్‌ 18! వావ్‌. ఇదంతా నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది. ఇరవై ఏళ్ల తర్వాత కూడా నాలోని ఉత్సుకత ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే దృఢ సంకల్పంతో.. అంతే పట్టుదలతో ప్రతీ పని చేస్తున్నాను. ఏదైనా మార్చగలిగే శక్తి అమ్మాయిలకు ఉంటుందని నేను విశ్వసిస్తాను. అవకాశాలు వస్తే తమను తాము నిరూపించుకోవడానికి వారు ముందుంటారు’’ అంటూ ప్రియాంక షేర్‌ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘అప్పటికీ ఇప్పటికీ ఎంతగా మారిపోయారు. గుర్తుపట్టలేకపోతున్నాం. ఏది ఏమైనా సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న మీరు మాకు ఆదర్శం’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రియాంక ఫొటోపై మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ కూడా స్పందించారు. ‘‘వన్స్‌ మిస్‌ వరల్డ్‌.. ఆల్వేస్‌ మిస్‌​ వరల్డ్‌’’ అని ఆమె కామెంట్‌ చేశారు. 

Include caption By using this embed, you agree to Instagram's API Terms of Use .

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top