'నాకు తెలుగు తెలియదు' | 'Premam' fame Anupama Parameshwaran takes Tollywood by storm | Sakshi
Sakshi News home page

'నాకు తెలుగు తెలియదు'

Jun 6 2016 6:14 PM | Updated on Sep 4 2017 1:50 AM

'నాకు తెలుగు తెలియదు'

'నాకు తెలుగు తెలియదు'

'అ ఆ' సినిమాలో నాగవల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా.

'అ ఆ' సినిమాలో నాగవల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా. పల్లెటూరి పిల్లగా అచ్చ తెలుగులో గలగల మాట్లాడుతూ సందడి చేసింది అనుమప్ పరమేశ్వరన్. అయితే ఆమెకు తెలుగు మాట్లాడడం రాదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మలయాళీ భామకు 'నాకు తెలుగు తెలియదు' అనే మాట తప్ప మరో ముక్కరాదు. అయినప్పటికీ 'అ ఆ'లో తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని అందరినీ ఆకట్టుకుంది.

'ఈ సినిమాలో నాకు చాలా తక్కువగా డైలాగులున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రోత్సాహంతో డబ్బింగ్ చెప్పాను. నాపై ఆయన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. ట్యూటర్ ను పెట్టుకోకుండానే డబ్బింగ్ చెప్పాను. నాగవల్లి పాత్రను తీర్చిదిద్దిన విధానం నాకు బాగా నచ్చింది. అందుకే వెంటనే ఓకే చెప్పా'నని అనుపమ్ పరమేశ్వరన్ వెల్లడించింది.

'అ ఆ' సినిమాలో తన పాత్రకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని తెలిపింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. ప్రస్తుతం 'ప్రేమమ్' రీమేక్ లో ఆమె నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement