అందరికీ మంచి పేరు రావాలి: ప్రభాస్‌ | Prabhas to release Telugu trailer of Arun Vijay’s ‘Crime 23’ | Sakshi
Sakshi News home page

అందరికీ మంచి పేరు రావాలి: ప్రభాస్‌

Apr 14 2018 12:55 AM | Updated on Aug 11 2018 8:48 PM

Prabhas to release Telugu trailer of Arun Vijay’s ‘Crime 23’ - Sakshi

ప్రభాస్‌తో అరుణ్‌ విజయ్, అరివళగన్‌...

అరుణ్‌ విజయ్‌ హీరోగా ‘వైశాలి’ ఫేమ్‌ అరివళగన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కుట్రమ్‌ 23’ని తెలుగులో ‘క్రైమ్‌ 23’ అనే టైటిల్‌తో అనువాదం చేస్తున్నారు. మహిమ నంబియార్, అభినయ కథానాయికలు. శ్రీమతి అరుణ ప్రసాద్‌ ధర్మిరెడ్డి సమర్పణలో ప్రసాద్‌ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌ సంయుక్తంగా తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ‘క్రైమ్‌ 23’ తెలుగు ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు. ప్రభాస్‌ మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘ఈశ్వర్‌’లో అరుణ్‌ విజయ్‌ సిస్టర్‌ శ్రీదేవితో కలిసి నటించాను.

ఇప్పుడు ‘సాహో’ చిత్రంలో అరుణ్‌ విజయ్‌తో కలిసి నటిస్తున్నాను. ‘క్రైమ్‌ 23 ట్రైలర్‌’ చాలా బాగుంది. హీరోగా అరుణ్‌ విజయ్‌కు, ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్న నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. అరుణ్‌ విజయ్‌ మాట్లాడుతూ– ‘‘ప్రభాస్‌ చేతుల మీదగా ట్రైలర్‌ లాంచ్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్‌ టైమ్‌ పోలీస్‌గా నటించాను. ఆల్‌ ఎమోషన్స్‌తో అరివళగన్‌ బాగా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది.

ప్రస్తుతం ‘సాహో’, మణిరత్నంగారి ‘నవాబు’ సినిమాల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘వైశాలి’ తర్వాత తెలుగులో రిలీజ్‌ అవుతున్న నా రెండో చిత్రమిది. కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు. ‘‘ప్రభాస్‌గారు ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అనువాద కార్యక్రమాలు కంప్లీట్‌ అయ్యాయి. తమిళంలో హిట్‌ సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది. తెలుగులో ఓ స్ట్రైట్‌ మూవీ చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement