టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌ | Prabhas Crazy Dance With Raveena Tandon on Tip Tip Barsa Pani song | Sakshi
Sakshi News home page

టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌

Aug 23 2019 12:30 AM | Updated on Aug 23 2019 3:53 AM

Prabhas Crazy Dance With Raveena Tandon on Tip Tip Barsa Pani song - Sakshi

రవీనాతో ప్రభాస్‌ స్టెప్స్‌

ప్రభాస్‌.. ఇప్పుడు నేషనల్‌ క్రష్‌. ‘బాహుబలి’తో దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. లేడీ ఫ్యాన్స్‌ అయితే చెప్పే పని లేదు. మరి ప్రభాస్‌ చిన్నప్పటి క్రష్‌ ఎవరో తెలుసా? రవీనా టాండన్‌. మరి ఆమెతో కలిసి డ్యాన్స్‌ చేసే అవకాశం వస్తే ప్రభాస్‌కి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఆ చాన్స్‌ రానే వచ్చింది. దీనికి కారణం ‘సాహో’ చిత్రం.

ఈ నెల 30న చిత్రం విడుదల కానున్న సందర్భంగా సౌత్, నార్త్‌లో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది ‘సాహో’ టీమ్‌. ఇందులో భాగంగా రవీనా టాండన్‌ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న ఓ హిందీ షోలో ప్రభాస్, శ్రద్ధా కపూర్‌ పాల్గొన్నారు. రవీనా నటించిన సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘టిప్‌ టిప్‌ పానీ బరసా’ పాటకు ఈ షోలో ప్రభాస్‌ స్టెప్పేశారు. అలాగే రవీనా చీర కొంగుని నోటితో పట్టుకొని సల్మాన్‌ ఖాన్‌ ‘కిక్‌ 2’ సినిమాలోని ‘జుమ్మేకీ రాత్‌ హై’ పాటకు కూడా స్టెప్పులు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement