బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌పై అసహనం వ్యక్తం చేసిన పూజ!

Pooja Hegde Fires On British Airways - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖులు రిషీ కపూర్‌, అతుల్‌ కస్బేకర్‌, పూజా హెగ్డేలు అంతర్జాతీయ విమానసంస్థపై విరుచుకపడ్డారు. భారతీయుల పట్ల బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ వ్యవహరిస్తున్న తీరుపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకు గౌరవమివ్వని సంస్థను ఆదరించకూడదనీ. అలాంటి వాటిని మనం కూడా దూరం పెట్టాలని రిషీ కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

అతుల్‌ కస్బేకర్‌ కూడా బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌పై అసహనం వ్యక్తం చేశాడు. తనకు కూడా గతంలో ఇలాంటి అనుభవం ఎదురైందని అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ సంస్థ విమానాలను ఎక్కలేదని తెలిపాడు. పూజా హెగ్డే కూడా ఓ సంఘటనను వివరిస్తూ.. ‘ ఓ ఇండియన్‌ నీళ్లు అడిగితే ఇవ్వడం లేదు. కానీ, పక్కనున్న విదేశీయులకు మద్యం మాత్రం ఎన్నిసార్లైనా ఇచ్చారని, భారతీయులంటే వారికి చిన్నచూపు. గ్లాస్‌ మంచి నీళ్ల కోసం రెండు గంటల ఎదురుచూశానని నిన్న రాత్రే నా ఫ్రెండ్‌ నాతో చెప్పుకొచ్చాడం’టూ ట్వీట్‌ చేసింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top