పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

Payal Rajput's RDX Love First Look Launch by Victory Venkatesh - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో అలరించిన పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ఆర్డీఎక్స్‌ లవ్‌(RDX లవ్‌) . తేజస్ కంచెర్ల హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

శనివారం ఈ సినిమా ఫస్ట్ ‌లుక్‌ని విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందని, సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ విక్టర్ వెంకటేశ్ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్‌తో పాటు ‘పవర్’ చిత్ర దర్శకుడు డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ), చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో వెంకటేష్‌కు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నిర్మాత సి.కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. శంకర్ భాను రచనా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామ్ మునీష్ సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top