చెప్పిన తేదీకి పక్కా | Pantham Movie Press Meet | Sakshi
Sakshi News home page

చెప్పిన తేదీకి పక్కా

Jun 18 2018 12:29 AM | Updated on Jun 18 2018 12:29 AM

Pantham Movie Press Meet - Sakshi

రాధామోహన్, చక్రవర్తి, ప్రకాశ్‌

గోపీచంద్, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘పంతం’. ‘బలుపు, పవర్, జై లవ కుశ ’ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసిన కె.చక్రవర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌  ఈ సినిమా నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కేకే రాధామోహన్‌ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు నటించిన 25వ సినిమా ఇది. మా సంస్థలో ఏడో చిత్రం. చాలా ప్రెస్టీజియస్‌గా నిర్మించాం. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయి.

జూలై 5న సినిమా విడుదల చేస్తామని ఏప్రిల్‌లోనే చెప్పాం. ఆ ప్రకారమే ప్రణాళికగా తెరకెక్కించాం. ఇటీవల యు.కె,లండన్, స్కాట్లాండ్‌లో కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించాం. ఈ నెల 21న విజయవాడలో ఆడియో, 24న వైజాగ్‌లో ఫంక్షన్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘నేను, మా టీమ్‌ కలిసి మంచి ప్రయత్నం చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’’ అన్నారు కె.చక్రవర్తి. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎ.ఎస్‌.ప్రకాష్‌ పాల్గొన్నారు. పృథ్వీరాజ్, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల.

Advertisement
 
Advertisement
Advertisement