సరికొత్త యాక్షన్‌ షురూ | Gopichand New Movie Grand Opening Pooja Ceremony | Sakshi
Sakshi News home page

సరికొత్త యాక్షన్‌ షురూ

May 4 2026 1:17 AM | Updated on May 4 2026 1:18 AM

Gopichand New Movie Grand Opening Pooja Ceremony

‘దిల్‌’ రాజు, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, గోపీచంద్, అనార్కలి, వెంకట్, విజయ్‌

గోపీచంద్‌ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ వి. వెంకట్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్‌ ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగులోకి అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. 

యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌–లక్ష్మణ్‌ మాస్టర్స్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత మల్లెమాల శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి క్లాప్‌ కొట్టారు. నిర్మాత ‘దిల్‌’ రాజు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్, యలమంచిలి రవిశంకర్‌ స్క్రిప్ట్‌ను అందజేశారు.

‘‘70ఎంఎం ఎంటర్‌టైన్‌ మెంట్స్‌’ వంటి గొప్ప నిర్మాణ సంస్థ ‘గోపీచంద్‌ 34’ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఒక సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది. వి. వెంకట్‌కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ బలమైన స్క్రిప్ట్‌ను తయారు చేశారు. గోపీచంద్‌ పూర్తి యాక్షన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రలో ఇంటెన్స్‌ డ్రామా, మంచి ఎమోషన్స్‌ ఉన్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, సంగీతం: సామ్‌ సీఎస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement