గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో ఒక గ్లింప్స్‌తో మేకర్స్ షేర్ చేశారు. దర్శకుడు సంకల్ప్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘భరతవర్ష’ (BharataVarsha) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఒక యోధుడి శూరత్వం ఏ రేంజ్‌లో ఉంటుందో చూపేందుకు గోపీచంద్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయనకు జోడీగా రీతూ వర్మ నటిస్తున్నారు. ఒక గిరిజన యువతిగా ఆమె నటిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లోని ఈ 33వ సినిమాను పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.


