అర్జున్‌ రెడ్డి రీమేక్‌కు హీరోయిన్‌ ఫిక్స్‌!

October Fame Banita Sandhu to Star in Tamil Remake of Arjun Reddy - Sakshi

టాలీవుడ్ సెన్సేషనల్‌ హిట్‌ అర్జున్‌ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా బాలా దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్‌పుట్‌తో నిర్మాతలు సంతృప్తిగా లేకపోవటంతో సినిమాను మరోసారి కొత్త టీంతో తెరకెక్కించే పనిలో ఉన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా దర్శకుడి పేరు ఫైనల్ చేయని ఈ సినిమాలో హీరోయిన్‌ను కూడా మార్చేస్తున్నారు.

మేఘా చౌదరి స్థానంలో బాలీవుడ్ నటి అక్టోబర్‌ ఫేం బనితా సందు నటించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. విక్రమ్‌ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్‌ రెడ్డి సినిమాకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన గిరీషయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top