
‘‘దిల్’ రాజుగారు నన్నెప్పుడూ అంతగా పొగడరు. ‘పటాస్’ చూసి, హిట్ సినిమా తీసావయ్యా’ అన్నారు. ‘సుప్రీమ్’ చూసి, బయటపడ్డావయ్యా అన్నారు. ‘రాజా.. ది గ్రేట్’ సినిమా చూసి,‘బాగా తీశావ్. డైరెక్టర్‌గా మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నావ్’ అన్నారు. తర్వాత ‘కొంచెం పెద్దగా కనపడుతున్నావోయ్’ అన్నారు. ఆయన పొడగడం చాలా హ్యాపీ’’ అన్నారు అనిల్ రావిపూడి.రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘రాజా.. ది గ్రేట్’ ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘స్ట్రాంగ్ ప్రాబ్లమ్ ఫేస్‌చేస్తున్న హీరోయిన్‌ను, విజువల్డీ చాలెంజ్డ్ అయిన హీరో పోలీస్ ఆపరేషన్‌లో ఇన్‌వాల్వ్ అయి ఎలా సేవ్ చేశాడన్నదే చిత్రకథ. బ్లైండ్ కాన్సెప్ట్‌లో డిఫరెంట్ జోనర్ సినిమాలు వచ్చాయి.
కానీ, కమర్షియల్ ట్రై చేద్దామని ఈ సినిమా చేశాను. రవితేజగారి ‘దరువు’కి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు ‘పటాస్’ కథ చెప్పాను. ఆయనతో వర్క్ చేయడం ఇప్పటికికుదిరింది. క్యారెక్టర్ పరంగా ఆయన శాటిస్‌ఫై అన్నప్పుడు హ్యాపీ ఫీలయ్యాను. ఈ కథ రామ్ దగ్గరకు వెళ్లిన మాట వాస్తమే. తర్వాత తారక్‌గారి (ఎన్టీఆర్)కి కూడా చెప్పాను. కానీ, తారక్‌గారికి చెప్పిన కథ ఈ కథ కాదు. వేరే కథ. నేను రామ్‌కోసం రాసుకున్న కథ ఇది. కానీ, రవితేజగారిని కలిసిన తర్వాత కంప్లీట్ స్క్రిప్ట్‌ను ఛేంజ్ చేశాను’’ అన్నారు.