Raja .. The Great
-
ఎన్టీఆర్‌కి చెప్పిన కథ ఈ కథ కాదు!
‘‘దిల్’ రాజుగారు నన్నెప్పుడూ అంతగా పొగడరు. ‘పటాస్’ చూసి, హిట్ సినిమా తీసావయ్యా’ అన్నారు. ‘సుప్రీమ్’ చూసి, బయటపడ్డావయ్యా అన్నారు. ‘రాజా.. ది గ్రేట్’ సినిమా చూసి,‘బాగా తీశావ్. డైరెక్టర్‌గా మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నావ్’ అన్నారు. తర్వాత ‘కొంచెం పెద్దగా కనపడుతున్నావోయ్’ అన్నారు. ఆయన పొడగడం చాలా హ్యాపీ’’ అన్నారు అనిల్ రావిపూడి.రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘రాజా.. ది గ్రేట్’ ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘స్ట్రాంగ్ ప్రాబ్లమ్ ఫేస్చేస్తున్న హీరోయిన్ను, విజువల్డీ చాలెంజ్డ్ అయిన హీరో పోలీస్ ఆపరేషన్‌లో ఇన్వాల్వ్ అయి ఎలా సేవ్ చేశాడన్నదే చిత్రకథ. బ్లైండ్ కాన్సెప్ట్‌లో డిఫరెంట్ జోనర్ సినిమాలు వచ్చాయి. కానీ, కమర్షియల్ ట్రై చేద్దామని ఈ సినిమా చేశాను. రవితేజగారి ‘దరువు’కి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు ‘పటాస్’ కథ చెప్పాను. ఆయనతో వర్క్ చేయడం ఇప్పటికికుదిరింది. క్యారెక్టర్ పరంగా ఆయన శాటిస్ఫై అన్నప్పుడు హ్యాపీ ఫీలయ్యాను. ఈ కథ రామ్ దగ్గరకు వెళ్లిన మాట వాస్తమే. తర్వాత తారక్గారి (ఎన్టీఆర్)కి కూడా చెప్పాను. కానీ, తారక్‌గారికి చెప్పిన కథ ఈ కథ కాదు. వేరే కథ. నేను రామ్‌కోసం రాసుకున్న కథ ఇది. కానీ, రవితేజగారిని కలిసిన తర్వాత కంప్లీట్ స్క్రిప్ట్‌ను ఛేంజ్ చేశాను’’ అన్నారు. -
అందరికీ దీపావళి శుభాకాంక్షలు : రవితేజ
హైదరాబాద్ : దసరా (విజయ దశమి) పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను ప్రముఖ హీరో రవితేజ పలకరించారు. అలాగే, ప్రముఖ సీనియర్ నటులు, నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్ కూడా. వారిద్దరు కలిసి తాజాగా రాజా ద్రి గ్రేట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తున్నారు. శనివారం దసరా సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు ప్రేక్షకులకు తన హీరో హీరోయిన్ సహనటులతో వెరైటీగా శుభాకాంక్షలు చెప్పిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో అందరికీ దసరా శుభాకాంక్షలు అని రాజేంద్ర ప్రసాద్ చెబుతుండగా దీపావళి శుభాకాంక్షలంటూ రవితేజ అంటాడు. నేను దసరా శుభాకాంక్షలు చెబితే వీడు దీపావళి అంటాడేమిటి అని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించగా మన సినిమా రిలీజ్ అయ్యేది దీపావళికేగా అంటాడు. అప్పుడు దసరాకు చెప్పి దీపావళి చెప్పొచ్చుగా అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇలా సరదాగా సాగే రెండు మూడు సంభాషణలతో ఆకట్టుకునేలా ఉంది ఆ వీడియో.. ఈ చిన్న వీడియోకు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది.. అంతేకాదు.. ఈ చిన్న వీడియో చూస్తేనే రవితేజ నిజంగా అంధుడేనా అన్నట్లుగా అద్భుతంగా నటించారని అనిపించక మానదు' మీరు కూడా ఓ లుక్కేయండి మరీ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు... https://t.co/l8BVE6kDOu — Anil Ravipudi (@AnilRavipudi) 30 September 2017 -
రాజాతో రచ్చ రచ్చ!
మార్నింగ్ టు మిడ్–నైట్ షూటింగ్ చేసినా... రవితేజలో ఎనర్జీ వన్ పర్సెంట్ కూడా డ్రాప్ కాదు తెలుసా! ఆయనతో నటిస్తే ఓ కిక్ వస్తుందని పలువురు నటీనటులు చెబుతుంటారు. ఇప్పుడా కిక్‌లో ఉన్నారు రాధిక. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మిస్తున్న ‘రాజా.. ది గ్రేట్’లో రాధిక పోలీస్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ, రాధిక, సంపత్‌రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ స్పాట్లో రవితేజతో కలసి దిగిన సెల్ఫీను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘మ్యాడ్నెస్ ఆన్ సెట్స్’ అని రాధిక పేర్కొన్నారు. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ‘దిల్’ రాజు.