
హైదరాబాద్ : దసరా (విజయ దశమి) పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను ప్రముఖ హీరో రవితేజ పలకరించారు. అలాగే, ప్రముఖ సీనియర్ నటులు, నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్ కూడా. వారిద్దరు కలిసి తాజాగా రాజా ద్రి గ్రేట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తున్నారు. శనివారం దసరా సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు ప్రేక్షకులకు తన హీరో హీరోయిన్ సహనటులతో వెరైటీగా శుభాకాంక్షలు చెప్పిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో అందరికీ దసరా శుభాకాంక్షలు అని రాజేంద్ర ప్రసాద్ చెబుతుండగా దీపావళి శుభాకాంక్షలంటూ రవితేజ అంటాడు.
నేను దసరా శుభాకాంక్షలు చెబితే వీడు దీపావళి అంటాడేమిటి అని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించగా మన సినిమా రిలీజ్ అయ్యేది దీపావళికేగా అంటాడు. అప్పుడు దసరాకు చెప్పి దీపావళి చెప్పొచ్చుగా అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇలా సరదాగా సాగే రెండు మూడు సంభాషణలతో ఆకట్టుకునేలా ఉంది ఆ వీడియో.. ఈ చిన్న వీడియోకు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది.. అంతేకాదు.. ఈ చిన్న వీడియో చూస్తేనే రవితేజ నిజంగా అంధుడేనా అన్నట్లుగా అద్భుతంగా నటించారని అనిపించక మానదు' మీరు కూడా ఓ లుక్కేయండి మరీ.
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు... https://t.co/l8BVE6kDOu
— Anil Ravipudi (@AnilRavipudi) 30 September 2017