‘అఆ’కు పదిలక్షల లైకులు

Nithin Samantha AAa Hindi Dubbed Movie Got 1 Million Likes - Sakshi

యంగ్‌ హీరో నితిన్‌, సమంత‌ జంటగా తెరపై కనిపించిన చిత్రం ‘అఆ’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పూర్తి కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ‘అఆ’తో నితిన్‌ ఖాతాలో భారీ హిట్‌ పడింది. ఇక త్రివిక్రమ్‌ స్టైల్లో మాటలు, విలువలు అందరినీ ఆకట్టుకుంటాయి. పాటలు కూడా సూపర్బ్‌గా ఉంటాయి. ఇక ఈ చిత్రం మరో మైలురాయిని అందుకుంది. ఈ సినిమా హిందీ వర్షన్‌లో రికార్డులు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి యూట్యూబ్‌లో మిలియన్స్‌ లైక్స్‌ వచ్చాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని హిందీ వర్షన్‌లో దాదాపు 20 కోట్ల మంది వీక్షించడం మరో విశేషం. 

ఇక వరుస విజయాలతో జోరుమీదున్న నితిన్‌కు ఉత్తరాదిన మంచి మార్కెట్‌ సెట్‌ చేసుకుంటున్నారు. సినిమాలను డైరెక్ట్‌గా హిందీలో రిలీజ్ చేయకపోయినా తెలుగులో రిలీజ్‌ అయిన కొద్ది రోజులకు డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో అంతగా ఆకట్టుకొని నితిన్‌ చిత్రాలు సైతం హిందీ వర్షన్‌లో భారీ హిట్టవుతున్నాయి. తాజాగా అఆ, చ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం హిందీ డ‌బ్ వర్షన్‌కు యూట్యూబ్‌లో ఓవరాల్‌గా 400 మిలియ‌న్ల వ్యూస్ వచ్చినట్లు ఆదిత్య మ్యూజిక్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

చదవండి:
ఈశ్వర్‌, అల్లా, జీసస్‌లపై ఒట్టు: వర్మ
సెన్సార్‌ పూర్తి.. సస్పెన్స్‌ అలానే ఉంది!


Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top