ఆల్రెడీ పెళ్లైన వారితో ప్రేమలో పడకండి: నటి | Neena Gupta Says Don't Fall In Love With Married Man | Sakshi
Sakshi News home page

వివాహితుడిని ప్రేమించకండి: నటి

Mar 3 2020 10:42 AM | Updated on Mar 3 2020 12:06 PM

Neena Gupta Says Don't Fall In Love With Married Man - Sakshi

ఒక మహిళ.. అమ్మ అని పిలుపుకై పడే ఆరాటం వర్ణనాతీతం. కానీ పెళ్లయ్యాక అమ్మ అని పిలిపించుకోవడం వేరు. పెళ్లికి ముందే తల్లి కావడం వేరు. అలా పెళ్లికి ముందే తల్లై సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు బాలీవుడ్‌ నటి నీనా గుప్తా. డేటింగ్‌ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే వెస్ట్‌ ఇండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగారు. ఫలితంగా పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమే ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా. కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయి వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు. (ఆ విషయం విని షాక్‌ అయ్యా!)


తాజాగా ఆమె తన జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఏదేమైనా సరే కానీ, వివాహితుడితో మాత్రం ఎలాంటి సంబంధం పెట్టుకోకండని సూచించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘అతను తన భార్య అంటే ఇష్టం లేదంటాడు. ఇంకా ఎంతోకాలం కలిసి ఉండలేం అని చెప్తాడు. అది నిజమేనని నమ్మి నువ్వు అతన్ని గాఢంగా ప్రేమిస్తావు. నీ భార్యతో ఇంకెప్పుడు విడిపోతావని పోరాడితే దానికింకా సమయం ఉందని చెప్పి దాటవేస్తాడు. ఎప్పటికైనా నీవాడే అవుతాడని కలలు కంటూ అతన్ని రహస్యంగా కలుస్తూ, షికార్లకు తిరుగుతూ, రాత్రిళ్లు ఏకాంతంగా గడుపుతూ ఇలా అన్నింటికీ ఒప్పుకుంటావు. అలా చాలారోజులు గడిచిపోతాయి. మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి.. త్వరగా నీ భార్యకు విడాకులిచ్చేస్తే మనం పెళ్లిపీటలెక్కవచ్చు అని ఆతృతగా చెప్తావు. ('అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్‌?')

కానీ ఈసారి అతను కాస్త కటువుగా.. తర్వాత చూద్దాంలే, అయినా విడాకులు అంత సులువు కాదు అంటూ ఏవేవో కుంటిసాకులు చెప్తూ మాట మార్చేస్తాడు. అప్పుడు అసలు నిజం ఏంటో నీకు గోచరిస్తుంది. కానీ ఆ సమయానికి నువ్వు ఏకాకిగా మారుతావు, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో చిక్కుకుంటావు. చివరాఖరకు అన్ని విధాలా ఆలోచించి నువ్వు ప్రేమించిన వ్యక్తికి దూరమయ్యేందుకే సిద్ధపడుతావు. నా జీవితంలోనూ సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఆ సమయంలో ఎంతో వేదన అనుభవించా. అందుకే చెప్తున్నా.. దయచేసి ఎవరూ అలాంటి పిచ్చిపనులు చేయకండి. పెళ్లైన వ్యక్తితో అస్సలు ప్రేమలో పడకండి’ అంటూ సలహా ఇచ్చారు. (టాలెంట్‌కు వయసుతో సంబంధమేముంది : నీనా గుప్తా)

#sachkahoontoe

A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement