కాబోయే భర్త అంటూ అనౌన్స్‌ చేసేసింది | Nayanatara Announced Vignesh Shivan as Fiance | Sakshi
Sakshi News home page

Mar 24 2018 2:20 PM | Updated on Mar 24 2018 6:55 PM

Nayanatara Announced Vignesh Shivan as Fiance - Sakshi

సాక్షి, చెన్నై : లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, యువదర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ మధ్య సంబంధం గురించి తెలియంది కాదు. నాన్‌మ్‌ రౌడీ ధాన్‌(తెలుగులో నేనూ రౌడీనే)చిత్ర షూటింగ్‌ సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 

ఆ తర్వాత వీరిద్దరూ పలు ఈవెంట్లలో జంటగా కనిపిస్తూ హాట్‌ టాపిక్‌గా మిగిలారు. ఒకానోక దశలో వీరిద్దరూ కేరళలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు రావటం.. వాటిని నయనతార ఖండించటం చూశాం. ఆ సమయంలో విఘ్నేశ్‌తో ఉంది కేవలం స్నేహం మాత్రమే అంటూ ఆమె ప్రకటించారు. అయినప్పటికీ వారి మధ్య రిలేషన్‌షిప్‌ గురించి తర్వాత చాలా కథనాలు వచ్చాయి.

ఇక శుక్రవారం ది హిందూ పత్రిక నిర్వహించిన మహిళా అవార్డుల వేడుకలో నయనతార పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటనా రంగంలో ఎక్సలెన్స్‌ అవార్డు అందుకున్న నయన్‌.. తల్లిదండ్రులకు, సోదరుడికి, కాబోయే భర్త(విఘ్నేశ్‌ను ప్రస్తావిస్తూ)కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వేదిక మీద ప్రకటించింది. దీంతో వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారన్న వార్త కన్ఫర్మ్‌ అయిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement