నందితకు అవకాశం దక్కేనా? | Nandita chance to Sequel movie! | Sakshi
Sakshi News home page

నందితకు అవకాశం దక్కేనా?

May 23 2016 3:10 AM | Updated on Apr 3 2019 8:57 PM

నందితకు అవకాశం దక్కేనా? - Sakshi

నందితకు అవకాశం దక్కేనా?

సీక్వెల్ ట్రెండ్ అన్నది కోలీవుడ్‌లోనే ఎక్కువగా సాగుతోందని చెప్పవచ్చు. ఆ తరహా చిత్రాలు మంచి విజయాలను పొందడం...

సీక్వెల్ ట్రెండ్ అన్నది కోలీవుడ్‌లోనే ఎక్కువగా సాగుతోందని చెప్పవచ్చు. ఆ తరహా చిత్రాలు మంచి విజయాలను పొందడం అందుకు ఒక కారణం కావచ్చు. అలా సీక్వెల్ చిత్రాల్లో మరో చిత్రం చేరబోతోందన్నది తాజా సమాచారం. అట్టకత్తి చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన నటి నందిని యువ నటుడు విజయ్‌సేతుపతి జంటగా నటించిన చిత్రం ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయానే సొంతం చేసుకుంది. అందులో నందిత కుముదా అనే పాత్రలో నటించింది.

విజయ్‌సేతుపతి ఆమెను తరచూ కుముదా హ్యాప్పీ అనే వాడు. ఆ డైలాగ్ బయట బాగా పాపులర్ అయ్యింది. అంతే కాదు వారిద్దరూ హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందారు. ఆ చిత్రం తరువాత విజయ్‌సేతుపతి, నందిత జంటగా ఇడం పోరుళ్ ఏవల్ అనే చిత్రంలో నటించారు. అయితే అందులో మొదట నందిత పాత్రకు నటి మనిషాయాదవ్‌ను ఎంపిక చేసి కొంత షూటింగ్ కూడా చేశారు. ఆ తరువాత ఆమెను తొలగించి నందితను నటింపజేశారు.

ఈ మార్పు వెనుక నటుడు విజయ్‌సేతుపతి హస్తం ఉందనే వదంతులు కూడా హల్‌చల్ చేశాయి. ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న విజయ్‌సేతుపతి ఇప్పటి వరకూ సీక్వెల్ చిత్రాల్లో నటించలేదు. తాజాగా ఇదర్కుదానే అశైపట్టాయ్ బాలకుమారా చిత్ర సీక్వెల్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఆ చిత్ర దర్శకుడు గోకుల్‌నే సీక్వెల్ చిత్రాన్ని హ్యాండిల్ చేయనున్నట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం నయనతార, తమన్నా అంటూ టాప్ కథానాయికలతో నటిస్తున్న విజయ్‌సేతుపతి ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా చిత్ర సీక్వెల్‌లో నటి నందితకు అవకాశం కల్పిస్తారా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. నటి నందిత ఇలాంటి సందిగ్ధంలోనే ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ అమ్మడు ఇంత వరకూ టాప్‌హీరోల సరసన నటించలేదు. అలాంటి అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోందని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement