నానాలో ఉన్న క్రూరత్వాన్ని నేనూ చూశా : సీనియర్‌ నటి

Nana Patekar Is Obnoxious, I Have Seen His Dark Side: Dimple Kapadia - Sakshi

సీనియర్‌ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణలు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తనుశ్రీకి మద్దతుగా పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు గళం విపుతున్నారు. నానా పటేకర్‌లో ఉన్న క్రూరత్వాన్ని వెలుగులోకి తెస్తున్నారు. హాలీవుడ్‌ మీటూ ఉద్యమం లాగా తనుశ్రీ వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ సీనియర్‌ నటుడు చాలా మంది మహిళా నటీమణులను వేధించినట్టు వెలుగులోకి వస్తోంది. తాజాగా ఎనిమిదేళ్ల క్రిందట ఎన్‌డీటీఈ ఇంటర్వ్యూలో నానా పటేకర్‌ గురించి సీనియర్‌ నటి డింపుల్‌ కపాడియా చెప్పిన ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నానా పటేకర్‌లో ఉన్న క్రూరత్వాన్ని తాను కూడా చూశానని నటి డింపుల్‌ కపాడియా అప్పట్లో చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

2010లో ‘తుమ్‌ మిలో తో నహి’  రిలీజ్‌ సందర్భంగా డింపుల్‌ కపాడియా ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇన్నేళ్లు నానాతో కలిసి నటించారు కదా..! పటేకర్‌ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించాదా? లేదా గతంలోలాగే ఉన్నారా? అని డింపుల్‌ను సినీ విమర్శకురాలు అనుపమ చోప్రా ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాకు తెలిసి అతడు దుర్మార్గుడు. అతడు గొప్ప నటుడే. కానీ అతడి జీవితంలో కూడా ఓ చీకటి కోణం ఉంది’... మంచి విషయంలోనూ, చెడు విషయంలోనూ రెండింటిలో చెప్పాలంటే..  నటుడిగా నైపుణ్యం విషయానికి వస్తే అతడ్ని మించిన వారు లేరు. అంత అద్భుతమైన నటుడు. అతడి ప్రతిభను చూశాకా.. వంద హత్యలు చేసినా క్షమించాలి అనిపిస్తుంది. నా ప్రాణం కూడా తీసుకో అనాలి అనిపిస్తుంది. నటుడిగా అతడిపై నాకున్న అభిప్రాయం ఇది. వ్యక్తిగతంగా అతడు చాలా స్నేహంగా ఉంటారు. కానీ అతడిలో కూడా చెడు కోణం ఉంది. ప్రతి ఒక్కరికీ అలాంటి చీకటి కోణం ఉంటుంది’ అని డింపుల్ పేర్కొన్నారు.

డింపుల్‌ కపాడియా, నానా పటేకర్‌ పలు ఐకానిక్‌ సినిమాలు తీశారు. 1991లో ఫైనల్‌ అటాక్‌, 1992లో అంగర్‌ వంటి సినిమాల్లో వీరు కలిసి నటించారు. ఇటీవల నటి రేణుకా షహానే కూడా నానా పటేకర్‌పై పలు ఆరోపణలు చేశారు. పటేకర్‌ స్థిరత్వం లేని వ్యక్తని, ఆయన స్వభావం వల్ల చిత్ర పరిశ్రమలోని చాలా మంది బాధపడ్డారని‌ చెప్పారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top