'ఓం నమో వేంకటేశాయ' సెన్సార్ పూర్తి | Nagarjuna Om namo venkatesaya completes censor formalities | Sakshi
Sakshi News home page

'ఓం నమో వేంకటేశాయ' సెన్సార్ పూర్తి

Feb 1 2017 4:30 PM | Updated on Jul 15 2019 9:21 PM

'ఓం నమో వేంకటేశాయ' సెన్సార్ పూర్తి - Sakshi

'ఓం నమో వేంకటేశాయ' సెన్సార్ పూర్తి

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి లాంటి

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఉత్తరాది నుంచి తిరుమలకు వచ్చి వేంకటేశ్వరుని పరమ భక్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న హథీరాం బాబా జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ నెల 10న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా బుధవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. భక్తిరస చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ ను ఇచ్చింది సెన్సార్ బోర్డ్. నాగార్జునతో పాటు అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ సినిమాలో బాలీవుడ్ నటుడు సౌరభ్ జైన్ వేంకటేశ్వరస్వామిగా కనిపించనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement