బిగ్‌బాస్‌లో ఆమెకు రోజుకు లక్ష రూపాయలు | Malayalam Bigg Boss Contestants Remuneration | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌లో ఆమెకు రోజుకు లక్ష రూపాయలు

Jul 3 2018 7:12 PM | Updated on Jul 3 2018 7:20 PM

Malayalam Bigg Boss Contestants Remuneration - Sakshi

ప్రాంతీయ భాషల్లో బిగ్‌బాస్‌ షో దూసుకెళ్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ నడుస్తుండగా.. మళయాళంలో బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ ఇటీవలే మొదలైంది. ఈ షోకు వ్యాఖ్యాతగా మళయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ వ్యవహరిస్తున్నారు. సాధారణంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలకు ఎంత రెమ్యూనరేషన్‌ ఇస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా సాధారణ ప్రజల్లో నెలకొంది. మళయాళం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన 16మంది సెలబ్రిటీలకు భారీగానే పారితోషికాలు అందుతున్నాయని టాక్‌.

బిగ్‌బాస్‌ నిర్వహకులు ప్రముఖ నటి శ్వేతా మీనన్‌కు హౌస్‌లో అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగినన్ని రోజులు రోజుకు లక్ష రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. మాజీ మిస్‌ కేరళ, ప్రముఖ యాంకర్‌ రంజిని హరిదాస్‌, శ్వేతా మీనన్‌ తర్వాతి స్థానంలో నిలిచారు. రంజినికి రోజుకు 80వేల రూపాయలు అందజేస్తున్నారు.

మిగత కంటెస్టెంట్‌ల రెమ్యూనరేషన్‌(రోజుకు)
ప్రముఖ హాస్యనటుడు అనూప్‌ చంద్రన్‌-  71,000
నటి పర్ల్‌ మానే- 50,000
టీవీ నటి ఆర్చన సుశీలన్‌- 30,000
నటి హిమా శంకర్‌- 20,000

మిగతా కంటెస్టెంట్‌లు దీపన్‌, సాబు, మనోజ్‌ వర్మలు రోజుకు 10వేల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా మిగతా హౌస్‌ సభ్యులు శ్రీ లక్ష్మీ, దివ్య సన, సురేశ్‌, అదితి రాయ్‌, శ్రీనిష్‌ ఆరవింద్‌, బషీర్‌లు ఎంత తీసుకుంటున్నరనేది తెలియలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement