హాలిడే జాలిడే

Mahesh Takes Off On Family Holiday To Celebrate Maharshi Success - Sakshi

తీరిక లేకుండా పని చేయడం. తీరికగా ఫ్యామిలీతో వెకేషన్‌ ఎంజాయ్‌ చేయడం మహేశ్‌బాబు స్టైల్‌. తాజాగా ‘మహర్షి’ సినిమాతో పెద్ద సక్సెస్‌ అందుకున్నారాయన. సినిమా ప్రమోషన్స్‌లో కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. ఇప్పుడు వర్క్‌ నుంచి లాంగ్‌ బ్రేక్‌ తీసుకొని హాలిడేకు వెళ్లారని తెలిసింది. ఈ హాలిడేలో పోర్చుగల్, ఇంగ్లాండ్‌ దేశాలు చుట్టి వస్తారట. ముందు పోర్చుగల్‌లో హాలిడే ఎంజాయ్‌ చేసి ఆ తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటిస్తారట. జూన్‌ 15 మళ్లీ ఇండియా తిరిగి రానున్నారని తెలిసింది. వచ్చే నెల మొదట్లో ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్‌ స్టార్ట్‌ కానుంది. అక్కడ ఇండియా మ్యాచ్‌లను మహేశ్‌ చీర్‌ చేస్తారేమో చూడాలి. తిరిగి రాగానే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతారు మహేశ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top