జూనియర్ ఎన్టీఆర్ కు 'ప్రిన్స్' ప్రశంస

జూనియర్ ఎన్టీఆర్ కు 'ప్రిన్స్' ప్రశంస


ప్రిన్స్ మహేష్ బాబు ఆఫ్ స్క్రీన్ లో సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. 'టెంపర్' సినిమా విషయంలో మాత్రం ఈ రూల్ ను బ్రేక్ చేశారు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆయనకు బాగా నచ్చిందట. జూనియర్ ఎన్టీఆర్ నటన ఆయనను ఆకట్టుకుందట.'టెంపర్' సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు ఎన్టీఆర్ ను అభినందించారని దర్శకుడు పూరి జగన్నాథ్ మీడియాతో చెప్పారు. ఎన్టీఆర్ నటన బాగుందని మెచ్చుకున్నారని కూడా వెల్లడించారు. ఒక అగ్రహీరో సినిమాను మరో టాప్ హీరో ప్రశంసించడం తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న సృహృద్భావ వాతావరణానికి అద్దంపడుతోంది. ఇటీవల విడుదలైన 'టెంపర్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top