అవును.. మహర్షి నిజమే

mahesh babu new movie maharshi first look release - Sakshi

మహేశ్‌బాబు.. ఆరడుగుల అందగాడు. అలా నడిచొస్తుంటే అమ్మాయిలు తన వంకే చూస్తుండిపోతారు. కానీ ఫర్‌ ఏ చేంజ్‌ అమ్మాయిల పైపు సరదాగా చూసే తుంటరి కాలేజీ స్టూడెంట్‌ పాత్రలో మహేశ్‌ కనిపిస్తే? అభిమానులకు పండుగే. అలాంటి పాత్రలోనే మహేశ్‌ని చూపించబోతున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి.  మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’.  అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది మహేశ్‌ 25వ చిత్రం.

ఇందులో మహేశ్‌బాబు ‘రిషి’ అనే కాలేజ్‌ స్టూడెంట్‌ పాత్రలో కొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నారు. గురువారం మహేశ్‌బాబు బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్‌లో మహేశ్‌ జస్ట్‌ స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చే స్టైల్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. సోమ వారం ‘సాక్షి’లో ప్రచురించినట్టుగా సినిమాకు ‘మహర్షి’ టైటిల్‌ కన్‌ఫర్మ్‌ చేశారు. ఇందులో ‘అల్లరి’ నరేశ్‌ రవి అనే పాత్రలో మహేశ్‌బాబు ఫ్రెండ్‌గా కనిపించనున్నారు. డెహ్రాడూన్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ 12న గోవాలో స్టార్ట్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం:     దేవిశ్రీ ప్రసాద్‌. కెమెరా: కె.యు. మోహనన్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top