నవ్వుల జర్నీలా ఉంది | Mahesh Babu Launches Silly Fellows Trailer | Sakshi
Sakshi News home page

నవ్వుల జర్నీలా ఉంది

Aug 27 2018 5:22 AM | Updated on Aug 27 2018 5:23 AM

Mahesh Babu Launches Silly Fellows Trailer - Sakshi

∙టీజీ విశ్వప్రసాద్, భరత్‌ చౌదరి, మహేశ్‌ బాబు, భీమనేని శ్రీనివాస్‌

‘అల్లరి’ నరేశ్, సునీల్‌ హీరోలుగా భీమనేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సిల్లీ ఫెల్లోస్‌’. చిత్రా శుక్లా కథానాయిక. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ సమర్పణలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం మహేశ్‌బాబు రిలీజ్‌ చేశారు. ‘‘అల్లరి’ నరేశ్, సునీల్‌కు.. అలాగే ‘సిల్లీ ఫెల్లోస్‌’ టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌.

ట్రైలర్‌ చూస్తుంటే నవ్వుల జర్నీలా అనిపిస్తోంది’’ అన్నారు.‘‘మా ‘సిల్లీ ఫెల్లోస్‌ చిత్రం ట్రైలర్‌ మహేశ్‌బాబు గారి చేతుల మీదుగా రిలీజ్‌ అవ్వడం హ్యాపీగా ఉంది’’ అని నిర్మాతలు అన్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ కానుంది. బ్రహ్మానందం, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: అనీష్‌ తరుణ్‌ కుమార్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement