కుశాలీ ఖుషీ

Madhavan and Khushali Kumar to star in Dahi Chinni - Sakshi

హీరోయిన్‌గా తొలి అవకాశం వస్తే ఏ అమ్మాయి అయినా ఎగిరి గంతేస్తుంది. అదీ మాధవన్‌ లాంటి నటుడు హీరో అంటే ఇక ఆ అమ్మాయి ఆనందం రెట్టింపు కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ కుశాలీ కుమార్‌ మాత్రం భయపడుతున్నారు. అశ్విన్‌ నీల్‌ మణి దర్శకుడిగా పరిచయం అవుతూ బాలీవుడ్‌లో ‘దహి చీని’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మాధవన్‌ హీరోగా నటించనున్నారు.

టీ–సీరిస్‌ వ్యవస్థాపకుడు, మ్యూజిక్‌ మొఘల్‌ గుల్షాన్‌ కుమార్‌ రెండో కుమార్తె, నిర్మాత భూషణ్‌ కుమార్‌ చెల్లి కుశాలీ కుమార్‌ ఈ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘‘హీరోయిన్‌గా నా ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. కానీ మాధవన్‌ లాంటి మంచి యాక్టర్‌తో కలిసి నటించాలంటే మాత్రం భయంగా ఉంది. అయితే బాగా కష్టపడి నా వంతు ప్రయత్నం చేస్తాను’’ అని చెప్పుకొచ్చారు  కుశాలీ. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top