హద్దు దాటలేదు | Kothaga Maa Prayanam Release Trailer | Sakshi
Sakshi News home page

హద్దు దాటలేదు

Jan 24 2019 12:48 AM | Updated on Jan 24 2019 12:48 AM

Kothaga Maa Prayanam Release Trailer - Sakshi

ప్రియాంత్

‘‘నటనలో శిక్షణ తీసుకోలేదు. కానీ సినిమాల పట్ల ఆసక్తితోనే హీరోగా చేశా. రియలిస్టిక్‌ సినిమాలంటే ఇష్టపడతా’’ అని ప్రియాంత్‌ అన్నారు. రమణ మొగిలి దర్శకత్వంలో ప్రియాంత్, యామినీ భాస్కర్‌ జంటగా తెరకెక్కిన ‘కొత్తగా మా ప్రయాణం’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియాంత్‌ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు డాక్టర్‌. నేను సీఎస్‌ (కంపెనీ సెక్రటరీ) చేశాను. ప్రస్తుతం బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా. ఇప్పటి సాఫ్ట్‌వేర్‌ కల్చర్‌ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం.

ఉద్యోగరీత్యా సొంత కుటుంబాలకు దూరంగా జీవిస్తున్న నేటి యువత ప్రవర్తన ఎలా ఉంది? అన్నదే కథాంశం. సినిమాలో అనవసరమైన రొమాన్స్‌ సీన్స్‌ను పెట్టలేదు. ఎక్కడా హద్దు దాటలేదు. మా సినిమాతో పాటు ‘మిస్టర్‌. మజ్ను, మణికర్ణిక: ఝాన్సీ రాణి ’ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఒక ఆడియన్‌గా నేనూ పెద్ద సినిమాలే చూడాలని కోరుకుంటాను. కానీ మా సినిమాలోని డిఫరెంట్‌ పాయింట్‌ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేస్తుంది.  హైదరాబాద్‌ లైఫ్‌స్టైల్‌ ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో ప్రసాద్‌ అనే కొత్త దర్శకుడితో నా నెక్ట్స్‌ సినిమా ఉంటుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement