డాక్టర్‌ ఐశ్వర్యతో విజయ్‌ వివాహం

Kollywood Director Vijay to Marry Aishwarya in July - Sakshi

మదరాసిపట్నం, శైవం సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఏఎల్‌ విజయ్‌, 2014లో నటి అమలా పాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లలోనే అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్న ఈ జంట ప్రస్తుతం సినిమాలతో బిజీ అయ్యారు. అయితే కొద్ది రోజులు విజయ్‌ రెండో పెళ్లికి సంబంధించిన వార్తలో మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఒక దశలో హీరోయిన్‌ సాయి పల్లవితో విజయ్‌ వివాహం అన్న ప్రచారం కూడా జరిగింది.

ఈ రూమర్స్‌కు చెక్‌ పెడుతూ.. విజయ్‌ తన వివాహానికి సంబంధిచి ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించారు. జూలై నెలలో తాను డాక్టర్‌ ఐశ్వర్యను వివాహమాడనున్నానని వెల్లడించారు. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా తనకు అన్ని సందర్భాల్లో సహకరించిన మీడియాకు విజయ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top