మన్మథుడు–2లో మహానటి

keerthi suresh in manmadhudu 2 - Sakshi

‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు కీర్తీ సురేష్‌. ఆ సినిమాలో ఆమె నటన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ చిత్రం తర్వాత నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ చిత్రం చేస్తున్నారు. ఇటీవలే నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా సైన్‌ చేశారు. తాజాగా ‘మన్మథుడు 2’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించేందుకు అంగీకరించారు.

ఇప్పటికే ఈ చిత్రంలో ఓ కీలకపాత్రకు సమంత ఎంపికైన విషయం తెలిసిందే. నాగార్జున, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మన్మథుడు 2’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పోర్చుగల్‌లో జరుగుతోంది. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనందీ ఆర్ట్‌ క్రియేషన్స్, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు.  దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top