కేసీఆర్‌ బయోపిక్‌.. ‘ఉద్యమ సింహం’

Kcr Biopic Udyama Simham Movie Launch - Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌ లో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే సావ్రితి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించగా ఇటీవల మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా ప్రారంభమైంది. తాజాగా మరో రాజకీయ నాయకుడి జీవిత కథ వెండితెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్‌ ఈ రోజే (గురువారం) ప్రారంభమైంది.

ఈ సినిమాలో కేసీఆర్‌ పాత్రలో సీనియర్‌ నటుడు నాజర్‌ నటిస్తున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. ‘ఉద్యమ సింహం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేసీఆర్‌ తెలంగాణ సాధన కోసం దీక్షను ప్రారంభించిన నవంబర్‌ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top