కొత్త అడుగులు?

Jr NTR Wants Start A Production Company - Sakshi

మహేశ్‌బాబు, రామ్‌చరణ్, రానా, నాని.. ఇలా టాలీవుడ్‌లో కొందరు హీరోలు నిర్మాతలుగా తమ ప్రయాణాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో అడుగులు వేయాలనుకుంటున్నారట ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారట ఎన్టీఆర్‌. కొత్త ఏడాదిలో ఈ విషయంపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నది తాజా సమాచారం. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో హీరో. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top