సైరా.. వీరా రెడ్డిగా జగ్గుభాయ్‌

Jagapathi Babu First Look In Sye Raa Narasimha Reddy - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా చిత్రయూనిట్ విభిన్నంగా నిర్వహిస్తున్నారు. బాహుబలి తరహాలో సినిమాలో నటించిన నటీనటులు పుట్టిన రోజు సందర్భంగా మోషన్‌ పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్‌ క్రియేట్ చేస్తున్నారు.

ఈ రోజు(మంగళవారం) జగపతి బాబు పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో ఆయన పోషిస్తున్న వీరా రెడ్డి పాత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, సుధీప్‌ లాంటి విలక్షణ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్నా కీ రోల్‌లో అలరించనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top